AP Liqour Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో అదనపు చార్జ్‌షీట్‌ను సిట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన రెండో చార్జ్‌షీట్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం నాడు సమర్పించారు. ముగ్గురు నిందితుల పాత్రపై కీలక ఆధారాలతో ఈ చార్జషీట్ రూపొందించినట్లు తెలుస్తోంది.
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ( ఏ31), ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి(ఏ32), బాలాజీ గోవిందప్ప(ఏ33) ప్రమేయం, నగదు తరలింపు అంశాలను సిట్ అధికారులు ఈ చార్జ్‌షీట్‌లో వివరించారు. లిక్కర్ పాలసీ మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారంలో వారి పాత్రను ఇందులో పేర్కొన్నారు. డిస్టలరీ యజమానులతో పాటు విజయ్ సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఈ ముగ్గురు ఫోన్లో మాట్లాడిన వివరాలను కూడా సేకరించినట్లు సిట్ అధికారులు తెలిపారు. లిక్కర్ సిండికేట్ సమావేశాలకు ధనుంజయ్ రెడ్డి పలుమార్లు హాజరయ్యారు అనడానికి గూగుల్ టేక్ అవుట్ సాక్ష్యాలను సిట్ అటాచ్ చేసింది.
ఇదిలా ఉంటే 305 పేజీలతో గత నెల 19వ తేదీన సిట్ తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అందులో ఉన్న 9 సంస్థలు, ఏడుగురు వ్యక్తులపై అభియోగాలు మోపింది. ఇప్పుడు దానికి అనుబంధంగా తాజా చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 19 సంస్థలు, 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు.