శుక్రవారం 30 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 19, 2020 , 17:23:09

ఏపీలో కొత్తగా 8,218 పాజిటివ్‌ కేసులు..58 మరణాలు

ఏపీలో కొత్తగా 8,218 పాజిటివ్‌ కేసులు..58 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,218 కరోనా పాజిటివ్‌కేసులు నమోదు కాగా మరో 58 మంది చనిపోయారు. ఏపీలో మొత్తం కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 6,17,776కు చేరింది. ప్రస్తుతం 81,763 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 530711 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,302కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 10,820 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 50,33,676 శాంపిల్స్‌ పరీక్షించారు.