న్యూఢిల్లీ : (AP Politics) ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు సెగ పుట్టిస్తున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యదు చేస్తూ పైచేయి సాధించే పనిలో వైసీపీ, టీడీపీ నిమగ్నమయ్యాయి. టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలువడంతో.. వైసీపీ నేతలు సీఈసీతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రెండు పార్టీల నేతలు తమ గోడు వెల్లబోసుకున్నారు. అమిత్‌షాతో పోటాపోటీగా మంతనాలు జరిపేందుకు ఇరుపార్టీలు పోటీపడ్డారు వైసీపీ, టీడీపీ ఎంపీలు. పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశం సందర్భంగా లాబీల్లో ఈ సీన్ కనిపించింది. ఒకవైపు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మరోవైపు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అమిత్‌షాతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. ఇరు పార్టీల నేతల పరస్పర దూషణలు, ఫిర్యాదులతో ఢిల్లీలో ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.
ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల బృందం గురువారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలను ఆధారాలతో వివరించిన వైసీపీ ఎంపీలు.. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు లోకేశ్, బోండా ఉమ, దేవినేని, పట్టాభి చేసిన వ్యాఖ్యలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై అలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నారంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. దొంగల ముఠాను ఎన్నికలకు అనుమతిస్తే దేశం పరిస్థితి అధోగతి పాలవుతుందని చెప్పుకొచ్చారు.
కాగా, స్థాయి సంఘాల సమావేశం సందర్భంగా అమిత్‌షాతో తమ గోడు వెళ్లబోసుకునేందుకు ఇరు పార్టీల నేతలు తహతహలాడారు. అమిత్‌షాకు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ లేఖ అందించగా.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాత్రం అమిత్‌షాతో మాట్లాడి ఫిర్యాదు చేశారు. అంతకుముందే చంద్రబాబు.. అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడి వైసీపీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన 20 మంది అరెస్ట్
మాజీ పోలీస్ కమిషనర్‌పై నాన్ బెయిలబుల్ వారంట్
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: వెంకయ్యనాయుడు
వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..