Jammu Kashmir : ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన 20 మంది అరెస్ట్
Jammu Kashmir : పూంచ్‌లోని భాటా దురియన్ అడవుల్లో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నది. పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు...

శ్రీనగర్ : (Jammu Kashmir) పూంచ్‌లోని భాటా దురియన్ అడవుల్లో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నది. పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం, ఇతర భద్రతా సంస్థలతో కలిసి ఆపరేషన్ కొనసాగిస్తున్నది. ఉగ్రవాదులను కనిపెట్టేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ గురువారానికి 20 వ రోజుకు చేరుకున్నది. దట్టమైన అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా బలగాలు డ్రోన్ల సాయం తీసుకుంటున్నాయి. మరోవైపు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారిని కూడా వదిలిపెట్టడం లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలపై గురువారం ముగ్గురు స్థానికులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 20 కి చేరింది.
పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, పూంచ్ జిల్లాలోని మెంధార్ తహసీల్‌కు చెందిన భటా ధురియన్ అడవుల్లో ఉగ్రవాదులను పట్టుకునేదుకు కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్‌లో, ఆ ప్రాంతంలోని కొంతమంది స్థానికులు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్లు భద్రతా దళాలు ఆధారాలను గుర్తించాయి. వీటి ఆధారంగా గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు ఇప్పటివరకు 20 మంది స్థానికులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇందులో కొందరు మహిళలు కూడా ఉన్నారు.
భటా ధురియన్ అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఇద్దరు జేసీఓలతో పాటు ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసు సిబ్బంది, ఒక ఆర్మీ జవాన్ గాయపడ్డారు. అక్టోబరు 8 నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైన్యం ప్రచారం కొనసాగుతున్నది. స్థానిక ప్రజలు పశువులను మేపడానికి అడవిలోకి వెళ్లడంపై భద్రతా దళాలు నిషేధం విధించాయి. మసీదులు, లౌడ్ స్పీకర్ల ద్వారా కొద్ది రోజులపాటు అడవిలోకి పశువుల్ని తీసుకెళ్లేందుకు వెళ్లవద్దని భద్రతా దళాలు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మాజీ పోలీస్ కమిషనర్‌పై నాన్ బెయిలబుల్ వారంట్
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: వెంకయ్యనాయుడు
వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

