AP News | శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం
AP News | శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు బిడ్డలను చంపేసి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాద ఘటన ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెదుళ్లవలస గ్రామానికి చెందిన కుర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి దారుణంగా హత్య చేసింది.
AP News : శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు బిడ్డలను చంపేసి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాద ఘటన ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెదుళ్లవలస గ్రామానికి చెందిన కుర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి దారుణంగా హత్య చేసింది. ఆపై అదే కత్తితో తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ ఘోరాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న వరలక్ష్మిని హుటాహుటిన శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దారుణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

