AP News | వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు వర్షసూచన
AP News | వాయువ్య బంగాళాఖాతం (Bay of Bengal), దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP News : వాయువ్య బంగాళాఖాతం (Bay of Bengal), దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బెంగాల్ (West Bengal), ఒడిశా (Odisha), ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ (APSDMA) తెలిపింది.
సముద్రం అలజడిగా ఉండి, కెరటాలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీచేసింది. ఐఎండీ నివేదిక ప్రకారం.. ఆగస్టు 23 ఆదివారం ఉదయం నాటికి ఈ అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలోనే స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి కూడా ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా కొనసాగుతుండటంతో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

