అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపగా, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసింది. ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కట్టుబడుతూనే భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా, అరకు లోక్సభ భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడం వల్ల దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు.
ఆయా జిల్లాల సరిహద్దులో ఉండే స్థానికులు 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొన్నది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Government of Andhra Pradesh issues a gazette notification, taking the total number of districts in the State from the existing 13 to 26 pic.twitter.com/czn80VkOPQ
— ANI (@ANI) January 26, 2022