అమరావతి : ఏపీలోని మార్కాపురం జిల్లాలో(Markapuram District) జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని ఏపీ మంత్రులు, డీజీపీ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Private travel Bus) రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 13 మంది సజీవదహనమై, మరో 13 మంది గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న ఏపీ హోం మంత్రి వంగలపుడి అనిత ( Minister Anita) , మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ( Ram Prasad reddy ) , డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించడంతో ఎక్కువ మందిని కాపాడినట్లు వెల్లడించారు.
ఘటనకు కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారని హోంమంత్రి వివరించారు. అనంతరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు పరామర్శించి ఓదార్చారు. విచారణలో అన్ని అంశాలు తేలాక తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నారని వెల్లడించారు.