Nara Lokesh | స్వేచ్ఛగా బతకాలన్న ఆమె కల నేడు సాకారమవుతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం గొప్ప విజయం సాధించిందని తెలిపారు. మరోవైపు ర్యాపిడో భాగస్వామ్యంలో వెయ్యి మందికి పైగా మహిళా డ్రైవర్లు ఉపాధి పొందడం సంతోషంగా ఉందని ప్రకటించారు.
మహిళలు ఈవీ బైక్‌ల కొనుగోలు కోసం రాయితీలు ఇస్తుందని నారా లోకేశ్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సంపాదనతో పాటు గౌరవం కూడా పొందుతున్నారని పేర్కొన్నారు. మొబిలిటీ అంటే కేవలం ప్రయాణం మాత్రమే కాదని.. ఇది అవకాశం, గౌరవం, ఆశ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మహిళల ర్యాపిడో వాహనాల డ్రైవింగ్‌పై నారా లోకేశ్ ట్విట్టర్(ఎక్స్)లో ఒక వీడియోను పోస్టు చేశారు.#IdhiManchiPrabhutvam అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు.
#IdhiManchiPrabhutvam
She dreamt of independence, and today she rides toward it. After the grand success of our #SthreeShakti free bus travel scheme, we are pleased to announce that in partnership with @rapidobikeapp, 1000+ AP women have taken the driver’s seat. With bike loans… pic.twitter.com/7EfJ5wQ3xB— Lokesh Nara (@naralokesh) August 25, 2025
Follow Us : on Facebook, Twitter
AP DSC | మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా.. కారణం ఏంటంటే?
Ambati Rambabu | చంద్రబాబులో భయం మొదలైంది.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
Tirupati | తిరుపతి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం.. మూడుసార్లు టేకాఫ్ అయ్యి.. రన్వేపైకే రిటర్న్!