అమరావతి : టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, బూస్టర్ డోస్‌పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ సర్కారు మార్గదర్శకాలను విడుదల చేసింది. 15-18 ఏండ్ల వయస్సు ఉన్న వారికి టీకా నమోదు ప్రక్రియ జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. కాగా జనవteenaరి 3,నుంచి 15 నుంచి 18 ఏండ్ల వయస్సు వారికి టీకాలు వేయడానికి సూచనలు జారీ చేసింది. అంతేకాకుండా ఇప్పటివరకు టీకా తీసుకోని వారికి జనవరి 10 నుంచి రెండవ డోస్ ఇవ్వనున్నారు.
రెండో డోస్ వేసుకుని 9నెలల పూర్తిచేసుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ ఇస్తారు. వైద్యుల సూచనల మేరకు జనవరి 10 నుంచి 60 ఏండ్లు నిండిన వారికి, ఆరోగ్య కార్యకర్తలకు , రెండు డోసులు పూర్తి చేసుకున్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఏపీ లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరింది. విదేశాల నుంచి వచ్చిన వారు 7మంది ఉన్నారు, మిగిలిన వారు ఆయా వ్యక్తుల ద్వారా సోకిన వారు. ఇటీవల ఏపీ కి వచ్చిన ఈ 7మంది గతంలో కువైట్, నైజీరియా, సౌదీ అరేబియా, అమెరికా దేశాలను సందర్శించారు.