Perni Nani | అప్పులు, నేరాల్లో ఏపీ ముందంజ : పేర్ని నాని
Perni Nani | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) ఆరోపించారు. ఆదివారం కృష్ణ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాల్లో 3.50 లక్షల కోట్ల అప్పులు( Debt ) చేశారని దుయ్యబట్టారు. అప్పులు, నేరాలు, నిరుద్యోగంలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని విమర్శించారు.
వైసీపీ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను, సంస్థను ఆదుకోగా అందుకు భిన్నంగా చంద్రబాబు ఆర్టీసీనీ అమ్మేయడానికి ప్రయత్నిస్తూ ఆ నెపం మహిళలపై వేసేందుకు కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చేస్తామనడం సరైనది కాదని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే వెళుతుందని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యుండకపోతే ఆర్టీసీని అమ్మేసేవారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

