SRM University | ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్‌లను యూనివర్సిటీ పెండింగ్‌లో పెట్టింది. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీన విచారణకు రావాలని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కు కార్మిక శాఖ నోటీసులు పంపించింది.
లేబర్ సెస్ మాత్రమే కాకుండా కార్మికులకు పీఎఫ్ కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంశం చర్చనీయాంశంగా ఉంది. కొద్దిరోజుల క్రితం యూనివర్సిటీ హాస్టల్లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. దర్యాప్తు కోసం అత్యవసర కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీ వర్సిటీలో పర్యటించి.. ఫుడ్‌పాయిజన్ కారణమని తేల్చారు.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటించారు. వర్సిటీలోని హాస్టల్, మెస్, తరగతి గదుల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. తాజాగా కార్మిక సమస్యలపై వర్సిటీకి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.