అమరావతి : విశాఖ రైల్వే స్టేషన్( Visakha Railway Station) లో ఆదివారం నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్ (Korba-Visakha Express) రైల్లో మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగి బోగీలు దగ్ధమైన ఘటనపై హోంమంత్రి అనిత (Minister Anitha) ఆరా తీశారు. డీఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విశాఖ సీపీ సీపీ శంఖబ్రత బాగ్చీ(SP Bagchi) , సంయుక్త ఎస్పీ ఫకీరప్ప విశాఖ రైల్వే స్టేషన్ను పరిశీలించారు.
అగ్నిప్రమాదం ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొన్నారు. రైలులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోయిన తరువాత రైలులో మంటలు చెలరేగాయని వివరించారు. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను ఆర్పి వేశారని తెలిపారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసి తరలిస్తున్నారని వెల్లడించారు.
Korba-Visakha Express | కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం