Srisailam | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు శనివారం శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ దేవి శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
అంతకు ముందు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులకు శ్రీశైలం ఈవో పెద్దిరాజు, ఇతర అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆలయ ప్రధాన గోపురం వద్ద స్వాగతం పలికారు. శ్రీ మల్లికార్జున స్వామి.. శ్రీభ్రమరాంబా దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజల తర్వాత జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్‌కు వేద పండితులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దుప్పాల వెంకట రమణ దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారికి ఈవో పెద్దిరాజు, ఏఈఓ శ్రీనివాసరావు, అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చక వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. అటుపై జస్టిస్ దుప్పాల వెంకట రమణకు శేష వస్త్రాలు లడ్డు ప్రసాదం జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈవోలు, శ్రీశైలం వన్ టౌన్ సిఐ ప్రసాద్ రావు పాల్గొన్నారు.