తిరుమల : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సభ్యులు ఇవాళ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సమయంలో స్వామివారి సేవలో మిశ్రా దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాద్వారం వద్ద టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో వేద పండితులు దంపతులకు ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేయగా ఆలయ అధికారులు టీటీడీ అగర్బత్తీలు, క్యాలెండర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.