IAS, IPS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏలూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ధాత్రిరెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న గీతాంజలి శర్మను ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా నియమించారు. పాడేరు సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న శౌర్యమాన్ పటేల్‌ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.