Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉన్నప్పటికీ.. ఒక కుటుంబానికి గరిష్ఠంగా రూ.3వేలు నగదు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేముందు ఈ డబ్బును అందజేయనున్నారు. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సీఎస్ సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు తుపాన్ ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు.