అమరావతి : ఏపీ గ్రామ, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం (AP Government) షాక్ ఇచ్చింది. సచివాలయాలను కేటగిరులుగా విభజించి , ప్రస్తుతమున్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను ఏ,బీ,సీ కేటగిరిగా విభజించింది. ఏ కేటగిరి సచివాలయల్లో ఉన్న సిబ్బందిని ఆరుకు, బీ కేటగిరిలో ఉన్న సచివాలయాలకు ఏడుకు , సీ కేటగిరిలో ఉన్న సచివాలయం ఎనిమిది మంది మాత్రమే ఉద్యోగులను ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.
గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల కుదింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు . గ్రామ, వార్డు సచివాలయాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ (Cabinet) భేటీలో పచ్చజెండా ఊపారు. కనీసం 2500 మందికి ఒక సచివాలయం ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించగా వారిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజిస్తున్నట్లు ఉత్వర్వులో పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 40 వేల ఉద్యోగాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.