ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలో పనిచేసే అధికారులకు హెచ్ఆర్ఏ పెంపును కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఏఐఎస్, సీసీఎస్ అధికారులకు బేసిక్ పేలో 30 శాతం ఇంటి అద్దె భత్యం ఇస్తున్నారు. దీన్ని 2026 జూన్ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. సీపీఎస్‌లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది. ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వం జమ చేసే వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది. పెంచిన వాటాను 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యుటేషన్‌పై పనిచేసే ఏఐఎస్, సీసీఎస్ అధికారులకూ ఆదేశాలు వర్తింపజేయాలని పేర్కొంది . ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ట్రెజరీలు, ఖాతాల డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.