Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల్లోని 16,666.57 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్ చేయనుంది. అమరావతి మండలంలోని వైకుంఠపురంలో, పెద్దమద్దూరు, ఎండ్రాయి కర్లపూడి, లెమల్లె గ్రామాల్లోని 7465 ఎకరాలను సమీకరించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో 9,097 ఎకరాలను సేకరించనున్నారు.