Amaravati | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ల్యాండ్ పూలింగ్‌లో అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ కాకుండా పట్టా పేరుతో జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అని ఉండటంతో అవి అమ్ముడుపోవడం లేదని ఇటీవల అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా రైతులందరికీ పట్టా పేరిట ప్లాట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా మార్పులు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ మంగళవారం జీవో జారీ చేశారు.