అమరావతి: వరుస ఎంవోయూలతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ బృందం దుబయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.3వేలకు కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది. తాజాగా అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో మరో కీలక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో కలిసి పనిచేసేందుకు రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీద్ ఏసియా సీడీవో(చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో-యిస్ జావియర్ బాల్ లు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.