AP News | ఏపీలోని 53 బార్ల వేలం కోసం ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి రీనోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం ఈ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు లీజుకు అనుమతి ఇవ్వనున్నారు.
ఈ 53 బార్ల వేలం కోసం నేటి నుంచి దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ అనుమతినిచ్చింది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 23వ తేదీన అప్లికేషన్లను పరిశీలించనుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ ఆక్షన్ నిర్వహించి.. సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలను ప్రకటిస్తారు.