Vasireddy Padma | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేయగా.. తాజగా మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీ వీడారు.
పార్టీలో కష్టపడిన వారికోసం జగన్ ఇప్పుడు గుడ్‌బుక్, ప్రమోషన్లు అని అంటున్నారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్‌బుక్ కాదు.. గుండె బుక్ అని స్పష్టం చేశారు. వారికి ప్రమోషన్లు అనే పదం వాడటానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అని అన్నారు. ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్.. గుడ్‌బుక్ పేరుతో మరోసారి మోసంచేయడానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు.
జగన్‌కు పార్టీని నడిపించడంలో బాధ్యత లేదని.. పరిపాలన చేయడంలో బాధ్యత లేదని.. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని గత ఎన్నికల తీర్పు స్పష్టంచేసిందని అన్నారు. వ్యక్తిగతంగా విధానాల పరంగా అనేక సందర్బాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశానని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రజా తీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్యే సీటు ఆశించారు. తనకు కానీ.. తన భర్తకు కానీ ఆ టికెట్ కేటాయించాని జగన్‌ను వాసిరెడ్డి పద్మ కోరారు. కానీ పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వాసిరెడ్డి పద్మ.. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసినప్పటికీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని అప్పట్లో ఆమె స్పష్టం చేశారు.అప్పటివరకు యాక్టివ్‌గా ఉంటూ వైసీపీ తరఫున గొంతు వినిపించిన ఆమె సైలెంట్ అయ్యారు.
ఇక జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడారు. దీంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను తనకే ఇస్తారని వాసిరెడ్డి పద్మ భావించారు. కానీ తన్నీరు నాగేశ్వరరావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు లభించట్లేదని భావించిన వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో వైసీపీ