Tammineni Sitaram | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా డిమాండ్‌పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదన్నారు. ప్రతిపక్షం ఉందా? లేదా? అన్నదే కీలకమని స్పష్టం చేశారు. ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టే జగన్ కోర్టుకు వెళ్లారని తెలిపారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. వైసీపీ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. 55 రోజుల్లో చంద్రబాబు టీడీపీ పాలన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని అన్నారు. ఐదేళ్లలో 2.71 లక్షల కోట్ల నగదు నేరుగా పేదలకు తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా అందించిందని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలో 7.8 వేల కోట్ల రూపాయ ఉందన్నారు. కానీ చంద్రబాబు ప్రజలను తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అందుకు ఎల్లో మీడియా వంతపాడటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.