YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ నేపథ్యంలో పులివెందుల పర్యటలో ఇవాల్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు వైసీపీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.