ఓ నేరస్థుడు రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లు పాలించారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అధికారంలో ఉండి రాష్ట్రంలో ఏ తప్పు చేయని నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని మండిపడ్డారు. రాజ్యాంగ ధర్మాలను గత ప్రభుత్వం సమాధి చేసిందని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. తండ్రి అధికారాన్ని అడ్డుకుపెట్టుకుని అవినీతి చేసిన వ్యక్తి.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు
జగన్ రూ. లక్ష కోట్ల అవినీతి చేశారని గతంలోనే ఫిర్యాదు చేశామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. జగన్ అక్రమాలపై సాక్ష్యాలతో సహా టీడీపీ ఫిర్యాదు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంపదను జగన్ ఆవిరి చేశారని మండిపడ్డారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని విమర్శించారు.
నిజాయితీ నాయకులనుకూడా అక్రమంగా అరెస్టులు చేశారని విమర్శించారు. . ఆ తర్వాత రాష్ట్ర సంపదను ఏ విధంగా నాశం చేశారో మనమంతా చూశామని అన్నారు. జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని విమర్శించారు. చట్టంలో లుసుగుల ఆధారంగా 11 ఏళ్లు జగన్ కోర్టుకు వెళ్లలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా దుష్టశక్తులుగా మారాయని అన్నారు. అమెరికన్ పెట్టుబడిదారుల లంచాలు ఇక్కడికి చేరాయని చెప్పారు. రూ.1750 కోట్లు లంచాలు తీసుకున్నారని ఎఫ్బీఐ చెప్పిందని తెలిపారు. ఖనిజాలు, మద్యం, ఇసుక తదితరాల్లో రూ.వేల కోట్ల దోపిడీ చేశారని అన్నారు. దుష్టశక్తులను గ్రామాల్లోకి రానీయకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.