తిరుమల : తిరుమల ( Tirumala ) లోని వేంకటేశ్వర స్వామిని ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీశ్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta ) శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అంతకు ముందు అర్చకులు, అధికారులు డీజీపీకి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం టీటీడీ ఈవో ఎం రవిచంద్ర శ్రీవారి ప్రసాదాలు, తీర్థప్రసాదాలు, ల్యామినేట్ చేసిన స్వామివారి ఫోటోను అందజేశారు. రంగనాయకుల మండపంలో ఆలయ వేదపండితులు వేదపండితులు డీజీపీని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డీఈవో లోకనాధం తదితరులు పాల్గొన్నారు.