AP News | ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల తీవ్రంగా పరిగణించింది. ఆయా ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాలను ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సమన్లు పంపింది. ఈ క్రమంలో సీఎస్, డీజీపీ ఇద్దరు గురువారం ఢిల్లీకి వెళ్లి వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సమావేశమయ్యారు. సచివాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. డీజీపీ వెంట ఇంటలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు. ఎన్నికల సంఘం స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో సీఎస్, డీజీపీ సమావేశమై ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. హింసాత్మక ఘటనలు జరగడానికి గల కారణాలు, తీసుకున్న చర్యలపై నివేదిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం.