తిరుమల : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి (Dr. KS Jawahar Reddy) ఆదివారం తిరుమల (TIrumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను ఈవో ఎవి.ధర్మా రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, తదితరులు పాల్గొన్నారు. రాత్రి తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.