(Jagan @ Delhi) న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం బిజీబిజీగా గడిపారు. కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. వీరి సమావేశం దాదాపు గంటపాటు కొనసాగింది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు, జాతీయ రహదారుల విస్తరణపై చర్చించారు. తొలుత రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు గడ్కరీకి జగన్ ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే ఆమోదించాలని కోరుతూ సీఎం గడ్కరీకి వినతిపత్రం అందజేశారు.
తీరప్రాంతంలో నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రిని కోరారు. వీటితో పాటు విశాఖపట్నం-భోగాపురం జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడ ఈస్ట్ హైవే నిర్మాణంపై కేంద్రమంత్రితో చర్చలు జరిపారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మార్గాని భరత్‌రామ్, బాలశౌరి, నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
అనంతరం ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అంతకుముందు జగన్ కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. దాదాపు అరగంటపాటు వీరి భేటీ కొనసాగింది. ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధితోపాటు పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఏర్పాటుపై మంత్రికి వివరించారు.
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..