Chandra Babu : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో వెంగమాంబ సెంట్రలైజ్డ్ కిచెన్ (Vengamamba Centralised Kitchen) ను ప్రారంభించారు. ఈ కిచెన్ ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి (AP CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ సమాచార ప్రసార శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
కాగా ఇటీవల తిరుమల లడ్డూ కల్తీపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. మరోవైపు లడ్డూ కల్తీ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం, ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం నడుమ ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్యలు చేయడంతో.. ఆయనపై కూడా పలువురు వ్యక్తిగత విమర్శలకు దిగారు.
#WATCH | On the occasion of Srivari Varshika Brahmotsavam, Andhra Pradesh CM N Chandrababu Naidu participates in the opening of Vengamamba Centralised Kitchen in Tirumala Tirupati Devasthanam, Tirumala.
(Source: AP I&PR) pic.twitter.com/shene7Jdfo
— ANI (@ANI) October 5, 2024