తిరుమల : తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మంత్రులు, అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రంలోపు సమగ్ర వివరాలతో నివేదిక (Report) ఇవ్వాలని ఇవ్వాలని టీటీడీ ఈవో(TTD EO) శ్యామలరావును ఆదేశించారు.
శ్రీవారి ఆలయ ప్రతిష్టకు, భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. లడ్డూ కల్తీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తిరుమల లడ్డూ అంశంపై కేంద్ర ఆహారశాఖ మంత్రి(Food Minister) ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) స్పందించారు.
సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది అన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. లడ్డూ కల్తీ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేసే అంశమని, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి శోభాకరంద్లాజే ట్వీట్ ద్వారా స్పందిస్తూ తిరుమల కాలేజీల్లో శ్రీవారి ఫొటోలు తొలగించాలని జగన్ అండ్ కో చూసిందని ఆరోపించారు. హిందూయేతర గుర్తులు సప్తగిరులపై ఏర్పాటు చేయాలని చూశారని వెల్లడించారు. హిందువులు కానివారిని బోర్డు చైర్మన్గా నియమించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు.