Chandrababu | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన తెలుగు అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కాకుండా ఎన్డీయే ప్రకటించిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వడంపై ఏపీ సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చారు. టీడీపీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉందని ఆయన తెలిపారు. కాబట్టి ఎన్డీయే అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. దేశం గౌరవించదగ్గ వ్యక్తి సీపీ రాధాకృష్ణన్ అని తెలిపారు. ఆయన దేశానికి, ఉప రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని ఆకాంక్షించారు. తెలుగువాడు అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే అభ్యర్థిని పెట్టాలని ఇండియా కూటమికి చంద్రబాబు సూచించారు. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి ఇండియా కూటమి రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. అది కాకుండా ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష (ఇండియా కూటమి) అభ్యర్థికి ఎలా మద్దతిస్తామని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ఏపీలో అధికార టీడీపీ-జనసేనతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ప్రకటించాయి.
Why announce a Telugu person as Vice Presidential candidate knowing defeat was certain? – AP CM Chandrababu reacts on Sudarshan Reddy’s candidature
We were part of NDA before elections, and it’s unfair to expect our support for someone else now. pic.twitter.com/MtCSDzz3aZ
— Naveena (@TheNaveena) August 22, 2025
తెలుగు వ్యక్తి కాకుండా ఎన్డీయే అభ్యర్థికి అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీజేపీ అంటే బాబు, జగన్ , పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురు మోదీ తొత్తులే అని విమర్శించారు. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే అని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు అని.. వైసీపీది తెర వెనుక అక్రమ పొత్తు అని విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని షర్మిల మండిపడ్డారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహం అన్నారని విమర్శించారు. ఐదేళ్లు దోచుకుతిన్నది దాచుకోవడానికి బీజేపీకి జై కొట్టారని అన్నారు. ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన RSS వాదికి మద్దతు ఇస్తారా ? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటని ప్రశ్నించారు.