AP CM Chandrababu Naidu : ‘అస్నా’ తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ వణికిపోతోంది. విజయవాడలో కొండచరియలు విరిగి పడడంతో పాటు పలు చోట్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దాంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్లోనే బస చేసిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వరదను సమర్ధంగా ఎదుర్కొంటామని చెప్పారు. వరద బాధితులందరికీ న్యాయం జరిగేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తామని.. ఆ తర్వాతే తాను అక్కడ నుంచి వెళ్తానని ఆయన తెలిపారు.
విజయవాడలో సహాయక చర్యలను ఆరా తీసిన చంద్రబాబు.. ఈ 50 ఏండ్లలో కనీవినీ ఎరుగని వరద వచ్చిందని, కృష్ణా నదికి ఈ స్థాయిలో వరద రావడం నష్ట తీవ్రతను పెంచిందని అన్నారు. అంతేకాదు బుడవేరు వాగు నిర్వహణ లోపం కారణంగా సమస్య తీవ్రత పెరిగిందని.. వరదల కారణంగా దాదాపు లక్ష కుటుంబాలు ముంపులో ఉన్నాయని, వాళ్లందిరికి అవసరమైన సాయం అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
The Andhra Pradesh State Capital Region of Amaravati city including Vijayawada & Mangalagiri is currently reeling under SEVERE FLOODS after extremely heavy rains lashed the region yesterday
Praying for the safety of the people 🙏 https://t.co/E97hxZAFE4 pic.twitter.com/B8wHoelAs4
— Karnataka Weather (@Bnglrweatherman) September 1, 2024
గతంలో హుద్ హుద్ తుఫాన్ వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొన్నామని.. ఇప్పుడు ఈ తుఫాన్ కూడా అదే తరహాలో ఎదుర్కొంటామని అన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సైకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం అని బాబు తెలిపారు. అస్నా తుఫాన్ కారణంగా నీటికుండలా మారిన ఏపీలో పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఆరా తీశారు. చంద్రబాబుకు ఫోన్ చేసి.. తక్షణమే అవసరమైన సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Rain wreaks havoc in Central Coastal Andhra Pradesh. Severe flooding in the Amaravathi capital region including Vijayawada
Next up is Telangana including #Hyderabad should take care as there are chances of extremely heavy rains #HyderabadRains
Bidar, Kalaburagi, Yadagiri &… pic.twitter.com/hKpcvGdoa9
— Karnataka Weather (@Bnglrweatherman) August 31, 2024