Sonia Akula | తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సరికొత్త సీజన్ మొదలైంది. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ మరోసారి అభిమానులను అలరించబోతున్నది. ఆదివారం కొత్త సీజన్ ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్‌ని స్టేజ్‌పైకి ఆహ్వానిస్తూ.. బడ్డీతో కలిపి బీబీ హౌస్‌లోకి పంపారు. ఇక బీబీ హౌస్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జీవీ మూవీ హీరోయిన్ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని. ఆమె తొమిదో తరగతి వరకు మంథనిలో, పదో తరగతి వరంగల్ హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్లో పూర్తి చేసింది.
సోనియా హైదరాబాద్‌లోని భోజ్రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. ఆమె బీటెక్ అనంతరం కొంతకాలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. చిన్ననాటి నుంచే సేవా దృక్పథం కలిగినా సోనియా 2017లో సామాజానికి తన వంతు సేవ చేయాలని ‘ఆసా’ (యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్) అనే స్వచ్ఛం సంస్థను స్థాపించింది. దాంతో అనాథ పిల్లలకు ఆర్థిక సాయం, లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేసింది. దిశా అత్యాచార నిందితుడి భార్య రేణుకకు నెలకు రూ.15వేలు సాయం అందించింది. ‘ప్రాజెక్ట్ ప్రేరణ’ పేరుతో యువతకు అవగాహన కార్యక్రమాలు, 50 మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించాలని లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువుకయ్యే ఖర్చులను సేకరించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది.
సోనియా తల్లిదండ్రులు ఆకుల చక్రపాణి, మల్లీశ్వరి. తండ్రి రైతు కాగా.. తల్లి హోంమేకర్ తన చిన్నతనం నుంచి వ్యయసాయం చేసేవారని సోనియా చెప్పుకొచ్చింది. తన బాల్యంలో తండ్రి దగ్గర ట్రాక్టర్ ఉండేదని, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా… అంత భారీ ఎత్తున చేయడం లేదని చెప్పింది. సోనియాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. సోనియా ఆకులకు సమాజ సేవ అంటే చాలా ఇష్టమని.. బీటెక్ చదివే రోజుల నుంచి పేద పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్పేదానన్ని చెప్పింది. తన సేవా కార్యక్రమాలు విస్తరించడానికి సోలోగా చేస్తే కష్టం అని గ్రహించి, ఆసా పేరుతో ఎన్జీవో ఫౌండేషన్ స్టార్ట్ చేశానని తెలిపారు. విరాట్ ఫౌండేషన్‌కి తాను కో ఫౌండర్‌నని చెప్పింది. సోనియా ఆకుల తొలిసారిగా 2019లో వచ్చిన జార్జ్‌రెడ్డి మూవీతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో జార్జ్‌రెడ్డి చెల్లెలిగా నటించింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ మూవీలోనూ కనిపించింది. 2020లో కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింప చేయగా.. ఆ కాన్సెప్ట్‌లో వచ్చిన మూవీలో నటించింది.
Get ready for Soniya’s stunning dance on #BiggBossTelugu8 stage! 🌟 Watch as she brings her charm and energy to the house. Don’t miss a moment of the excitement every night at 9:30 PM and 9:00 pm on weekend only on @DisneyPlusHSTel and #StarMaa #SoniyaonBB8 pic.twitter.com/1lo8nBcqxu
— Starmaa (@StarMaa) September 1, 2024