Keerthy Suresh | సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలు, కలలతో వచ్చేవారు చాలా మంది ఉంటారు. ఒకటి రెండు హిట్లు రావడం సరే… కానీ ఆ క్రేజ్‌ను నిలబెట్టుకోవడమే నిజమైన సవాలు. ఒకసారి మనం అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోయి పర్లేదు, కానీ ఉన్న పేరు కూడా దెబ్బతింటే, మళ్లీ మునుపటిలా ఎదగడం అసాధ్యమే. ఈ తరహా పరిస్థితులను ఇప్పుడు కీర్తి సురేష్ ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. 2018లో వచ్చిన మహానటి సినిమాతో ఆమె సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచింది. సావిత్రిగా చేసిన ఆమె పోషణ, నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అపారమైన ప్రశంసలు వచ్చాయి. అదే సినిమా ఆమెకు జాతీయ పురస్కారాన్ని కూడా తీసుకొచ్చింది.
అయితే ఆ తరువాత ఆమె కెరీర్ గమనం తగ్గుతూ వచ్చింది. కొన్ని మంచి సినిమాలు చేసినా, “మహానటి” స్థాయి హిట్ మాత్రం రాలేదు. “దసరా” వంటి సినిమాలతో మెప్పించినా, వాటి తర్వాత ఆమె కెరీర్ మరింత బలపడేలా మారలేదు. ఇప్పుడు తాజాగా తమిళ పరిశ్రమలో కీర్తి చేయబోతున్న ఒక కొత్త సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్‌గా సినీ వర్గాల్లో చెబుతున్నారు. ఇందులో కీర్తితో పాటు మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానుల్లో ఆందోళన మొదలైంది. “ఇలాంటి కథలు ఎంచుకోవడం, కొత్త దర్శకులతో పని చేయడం ఆమె స్థాయికి సరిపోయేదేనా?” అన్న చర్చ సాగుతోంది.
ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ కీర్తికి ఎంత వరకు ఉపయోగపడతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. కీర్తి నటించిన రివాల్వర్ రీటా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో సినిమా కన్నె వేడి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలపై కూడా అంచనాల కన్నా ఆందోళనే ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే, ఆమె తీసుకున్న తాజా నిర్ణయాలపై పునః పరిశీలించుకోవల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక బాలీవుడ్లో కీర్తి చేసిన ఎక్స్పోజింగ్ రోల్స్ కూడా ఆమెకి నెగెటివిటీని తెచ్చిపెట్టింది. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్న కీర్తి ఇలాంటివి చేయాలా? అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.