Coolie | కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నారు. గత వారం విడుదలైన ‘కూలీ’ చిత్రం, రీలీజ్‌కి ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్మురేపుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో రజినీ ..దేవ్ అనే పాత్రలో కనిపించారు. తనదైన స్టైల్, ఎనర్జీతో అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొన్న నేపథ్యంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊహించని స్థాయిలో జరిగాయి.
రీలీజ్ రోజు నుంచే సినిమాకు అద్భుత ఓపెనింగ్స్ లభించాయి. సెలవులు, వీకెండ్ కలిసిరావడం వల్ల వసూళ్లు గట్టిగానే వచ్చాయి. ఫలితంగా ‘కూలీ’ మూవీ మొదటి మూడు రోజులలోనే 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదివరకూ ‘జైలర్’, ‘2.0’ వంటి చిత్రాలు ఈ మార్క్‌ను క్రాస్ చేయగా, ‘కూలీ’ ఈ జాబితాలో చేరిన మూడో చిత్రంగా నిలిచింది. ‘రోబో’, ‘కబాలి’ వంటి చిత్రాలు రూ.300 కోట్ల క్లబ్‌కు దగ్గరగా వచ్చినా, చివరికి ఆ మార్క్‌ను టచ్ చేయలేకపోయాయి. అయితే సౌత్ స్టార్స్ గ్రాస్ మార్క్ లీడర్స్ ఎవరనేది చూస్తే.. అందులో ప్రభాస్ టాప్‌లో నిలిచారు. ఇప్పటివరకు ఆయన నటించిన ఆరు సినిమాలు రూ.300 కోట్ల మార్క్ దాటాయి.
విజయ్ దళపతి .. నాలుగు సినిమాలు, రజినీకాంత్ , జూనియర్ ఎన్టీఆర్ – చెరో మూడు సినిమాలు రూ.300 కోట్ల క్లబ్లో చేరాయి. రాబోయే రోజుల్లో ఈ లిస్టులోకి మరిన్ని పేర్లు చేరే అవకాశముంది. ఏది ఏమైన ఈ రేంజ్ వసూళ్లతో రజినీ మళ్లీ బాక్సాఫీస్ బాద్షాగా తన స్టాంప్ వేసినట్టే అని ముచ్చటించుకుంటున్నారు. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.444 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుత ట్రేడ్ టాక్ ప్రకారం, కూలీ రూ.460 కోట్ల మార్క్‌ను దాటితే, మరికొన్ని రికార్డులు తిరగరాయబడతాయని చెబుతున్నారు. మరోవైపు 500 కోట్ల క్లబ్లో చేరే అవకాశమూ ఉందని అంటున్నారు.