Chandrababu | తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి అవమానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. హైదరాబాద్ స్థాయిని దిగజార్చేలా మాట్లాడారు. 1995లో హైదరాబాద్ పాడుబడినట్లు ఉండేదని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షాద్ర ఏరియాలో బీజేపీ తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి వస్తే చాలా బాధేస్తోందని అన్నారు. ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఇలా అవ్వడానికి కారణం ఎవరు? గత పదేళ్లు ఎవరు పరిపాలించారని ప్రశ్నించారు. అదే ఈ పదేళ్లు డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఉంటే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్‌ను తలదన్నేలా తయారయ్యేదని చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడి ప్రజలు సరైన గాలి పీల్చాలంటే.. మోదీ ఆక్సిజన్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అందుకే ఢిల్లీలో ఉండే తెలుగువాళ్లు ఇంటింటికీ వెళ్లి బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని చెప్పాలని తెలిపారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు సోషల్‌మీడియాలో భగ్గుమంటున్నారు. చంద్రబాబు అంత చెత్త పొలిటీషియన్ దేశంలోనే ఎక్కడా లేడని మండిపడుతున్నారు. బాబు రాజకీయాల్లోకి రాకపోయుంటే ఏపీ, తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందేదని కామెంట్లు పెడుతున్నారు.
ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది
ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైంది
ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు?? పదేళ్లు ఎవరు పరిపాలించారు??
అదే పదేళ్లు డబల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేది – ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో… pic.twitter.com/wpOR2MMXGD
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025