Chandrababu | తుపాన్‌ను నివారించలేం.. ముందు జాగ్రత్తలతో చాలా నష్టాన్ని నివారించగలమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం టీమ్‌గా పనిచేశామని చెప్పారు. కష్టకాలంలో బాధితుల కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు అన్నారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యవసర సరుకులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు. సమర్థంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం టీమ్‌గా పనిచేశామని అన్నారు. మరో రెండు రోజులు ఇలానే పర్యటిస్తే.. మరింత ఊరట ఇవ్వగలమని చెప్పారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని.. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించారు. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించాలన్నారు.
తుపాన్ కారణంగా ఇద్దరు మరణించారని చంద్రబాబు తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని అన్నారు. మన చర్యలతో ప్రభుత్వంపై భరోసా పెరిగిందని తెలిపారు.