అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల (10th Exam) షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు. 17న ఫస్ట్ లాంగ్వేజ్,19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న మ్యాథ్స్, 26న ఫిజిక్స్,28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరుగనున్నాయని వివరించారు.
కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికను విడుదల చేసి పాఠశాలలకు పంపించింది. దీని ప్రకారం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. ఈనెల1 నుంచి ప్రారంభమైన ప్రత్యేక తరగతులు మార్చి 10వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు.