తిరుమల : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ (Chief Secretary Vijayanand) తిరుమల ( Tirumala) శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన సీఎస్‌కు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్వీరచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో శ్యామలరావు సీఎస్‌ను సన్మానించి, స్వామివారి ఫోటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులున్నారు.
ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) అవుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 58,908 మంది భక్తులు దర్శించుకోగా 19,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి (Hundi Income) రూ. 3.23 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.