అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ(AP Cabinet) భేటీ ఈనెల 16న ( బుధవారం) సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు. ఈనెల 9న జరుగవలసిన కేబినెట్ సమావేశం పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(Ratan Tata) మరణంతో ఆయనకు గౌరవ సూచకంగా సంతాపం తెలిపి వాయిదా వేసిన విషయం తెలిసిందే. రేపు జరుగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంతో పాటు మరికొన్ని కొత్త పాలసీలపై చర్చించనుంది.