అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ (AP Cabinet) సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ సమావేశంలో నూతన మద్యం పాలసీ(New Liquor Policy) , మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలు, చెత్త పన్ను రద్దు, జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటు, పోలవరం నిర్మాణంపై కీలక చర్చ జరిగే అవకాశముంది .
అమరావతి రాజధాని పున: నిర్మాణం తదితర అంశాలపై తీర్మానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu) అధ్యక్షతన జరుగునున్న సమావేశానికి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఉన్నతశాఖాధికారులు పాల్గొననున్నారు. ఈ కేబినెట్లో మరో పదిరోజుల్లో దసరా ఉత్సవాలు జరుగనున్న దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు తీపి కబురును అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.