అమరావతి : ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్( Ajit Pawar ) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ( AP Cabinet ) తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.
సమావేశం ప్రారంభంలోనే విమాన ప్రమాదంపై ప్రస్తావిస్తూ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ సహా ఐదుగురు మృతిపై విచారం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆకస్మిక మృతి పట్ల కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదం మహారాష్ట్రతో పాటు దేశానికి తీరని లోటని మంత్రి లోకేష్ అన్నారు.
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ముంబయి : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar) తో పాటు మరో 5గురు విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బారమతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చార్టెడ్ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ముంబయిలో నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో పాల్గొన్న ఆయన బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలో జరుగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తన చార్టెడ్ విమానంలో బారమతిలో ఉదయం 8.45 గంటలకు ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిపోయిందని. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawa ) చనిపోయారని డీజీసీఏ వెల్లడించింది.