AP Assembly Session | ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఇక మహిళా ఎమ్మెల్యేలకు సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు ఈ సదస్సుకు హాజరుకాబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు సీఎం చంద్రబాబు, లోక్సభ స్పీకర్ హాజరవుతారని పేర్కొన్నారు. ముగింపు రోజున గవర్నర్ కూడా వస్తారని చెప్పారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.