అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో మరో యువకుడు లోన్‌యాప్ వేధింపులకు బలయ్యాడు. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన బోగిరెడ్డి గిరిప్రసాద్ అనే యువకుడు లోన్‌యాప్ లో రుణం తీసుకుని తిరిగి చెల్లించాడు. ఇంకా బాకీ ఉందని లోన్‌యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు వస్తుండడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
లోన్ యాప్‌ల వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.