అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ (YCP) కి మరో షాక్ తగిలింది . ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన 24 గంటల్లోనే మాజీ ఎమ్మెల్యే , వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ (Former MLA Rehman) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం జగన్కు పంపారు.
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపడుతుందని పేర్కొన్నారు. కాగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే.