అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి ( Bus Accident ) గురయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ( Passengers Safe) బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలో అర్దరాత్రి రోడ్డుపై నిలబడ్డ లారీని ఢీ కొట్టింది. ఈ సమయంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు .
అయితే ప్రమాదం వల్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును. లారీని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ముందు ఆగి ఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడం, లారీని రహదారిపై నిలిచి ఉంచడంతో లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.