శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి చిరుత చిక్కిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అటవీశాఖ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల ప్రతిపాదన మేరకే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అడవిలో 300 కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 200 కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదని సూచించారు.